ఇండోనేషియన్ ఓపెన్ లో చరిత్ర సృష్టించిన సాత్విక్, చిరాగ్... అభినందించిన సీఎం జగన్
- ఇండోనేషియన్ ఓపెన్ లో డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత జోడీ
- ఫైనల్లో వరల్డ్ చాంపియన్లను కంగుతినిపించిన సాత్విక్-చిరాగ్
- వరుస గేముల్లో అదరగొట్టారంటూ సీఎం జగన్ కితాబు
ఇండోనేషియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ షెట్టీ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించారు. ఇవాళ జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట వరల్డ్ చాంపియన్ మలేషియా జోడీ ఆరోన్ చియా- సోహ్ వూయి యిక్ పై 21-17, 21-18తో అద్భుత విజయం సాధించారు. తద్వారా, ప్రతిష్ఠాత్మక ఇండోనేషియన్ ఓపెన్ లో తొలిసారి డబుల్స్ కిరీటం సాధించిన భారత ద్వయంగా వీరు రికార్డు పుటల్లోకెక్కారు.
ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ స్పందించారు. అద్వితీయ ప్రదర్శన కనబరిచి ఇండోనేషియా ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచారంటూ ఏపీ షట్లర్ సాత్విక్, చిరాగ్ జోడీని అభినందించారు.
ఫైనల్లో వరల్డ్ చాంపియన్లను వరుస గేముల్లో ఓడించడం అయోఘం అని కొనియాడారు. సాత్విక్-చిరాగ్ జోడీ భవిష్యత్తులోనూ మరిన్ని టోర్నమెంట్లలో చాంపియన్లుగా నిలవాలని సీఎం జగన్ అభిలషించారు.