ఎండ ఎక్కువగా ఉంది... పాదయాత్ర చేసి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు: భట్టి విక్రమార్కకు గుత్తా సలహా
- పాదయాత్రలు షురూ చేస్తున్న కాంగ్రెస్ నేతలు
- రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయన్న గుత్తా సుఖేందర్ రెడ్డి
- భట్టి పాదయాత్రకు గమనం, గమ్యం లేవని విమర్శలు
- కేసీఆర్ సమర్థుడైన నేత అని కితాబు
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అసలే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఈ ఎండల్లో పాదయాత్ర చేసి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని నా సలహా అని వెల్లడించారు. అయినా, భట్టి ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నట్టు అని గుత్తా ప్రశ్నించారు. గమనం, గమ్యం లేని పాదయాత్ర అని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు నల్గొండ క్లాక్ టవర్ వద్ద సభ జరిపితే దారుణంగా విఫలమైందని అన్నారు. ఇక, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థిమితం లేని నాయకుడు అని విమర్శించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించిందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తమ నేత కేసీఆర్ సమర్థుడు అని కొనియాడారు.