ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్.. నేడు, రేపు పలు రైళ్ల రద్దు

  • బహానగ స్టేషన్‌లో కొనసాాగుతున్న ట్రాక్ పనుల పునరుద్ధరణ
  • నేడు ఏడు, రేపు మూడు రైళ్ల రద్దు
  • తిరుపతి-సంత్రగచ్చి రైళ్లు కూడా రద్దు చేసినట్టు ప్రకటన
ఒడిశాలో ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత  బహానగ స్టేషన్‌లో దెబ్బతిన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి. 

నేడు ఏకంగా ఏడు రైళ్లను రద్దు చేయగా, రేపు మూడు రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. నేడు షాలిమార్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-షాలిమార్ (18045/18046) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు కాగా, రేపు సికింద్రాబాద్-అగర్తల (07030), గువాహటి-సికింద్రాబాద్ (02605) ప్రత్యేక రైళ్లను కూడా రద్దు చేశారు. అలాగే, సంత్రగచ్చి-తిరుపతి, తిరుపతి-సంత్రగచ్చి (22855/22856) రైళ్లతోపాటు మరికొన్ని రైళ్లు కూడా రద్దయ్యాయి.

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు నిన్న ఆలస్యమయ్యాయి. ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన రైలు మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


More Telugu News