హ్యుండాయ్ నుంచి కొత్త వాహనం... ఎక్స్ టర్
- మైక్రో సెగ్మెంట్లో కొత్త వాహనం
- సరికొత్త ఫీచర్లతో ముస్తాబైన హ్యుండాయ్ ఎక్స్ టర్
- 26 సేఫ్టీ ఫీచర్లతో చిన్న కారు
- ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఎక్స్ టర్
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్ భారత్ లో సరికొత్త ఎస్ యూవీని ప్రవేశపెట్టనుంది. దీనిపేరు ఎక్స్ టర్ (Exter). ఇది కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఫ్రంట్-రియర్ డ్యూయల్ కెమెరాతో కూడిన డాష్ కామ్, 5.84 సెం.మీ ఎల్సీడీ డిస్ ప్లే ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, స్మార్ట్ ఫోన్ యాప్ ఆధారిత కనెక్టివిటీ, మల్టిపుల్ రికార్డింగ్ మోడ్స్ వంటి ఫీచర్లతో ఎక్స్ టర్ వాహనాన్ని ముస్తాబు చేసినట్టు హ్యుండాయ్ వెల్లడించింది. మైక్రో ఎస్ యూవీ సెగ్మెంట్లో ఈ ఫీచర్లు అందించడం ఇదే తొలిసారి అని తెలిపింది.
ఇక, భద్రతాపరంగానూ ఎక్స్ టర్ మేకింగ్ లో రాజీపడలేదని తెలుస్తోంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు ఇచ్చారు. ఇందులో ఉన్న అన్ని వేరియంట్లలో చూస్తే మొత్తం 26 సేఫ్టీ ఫీచర్లు పొందుపరిచారు.
ఈ సెగ్మెంట్లో మరే ఇతర వాహనాల్లో లేని ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్ సీ), వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్ (వీఎస్ఎం), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), 3 పాయింట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, కీలెస్ ఎంట్రీ, ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ఈఎస్ఎస్, బర్గలర్ అలారం తదితర ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. హ్యుండాయ్ ఎక్స్ టర్ 3 పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో వస్తోంది.
ఇందులో 4 సిలిండర్ ఇంజిన్ పొందుపరిచారు. 1.2 లీటర్ ఐ కప్పా పెట్రోల్ ఇంజిన్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్/ఆటో మాన్యువల్ ట్రాన్స్ మిషన్), 1.2 ఐ బై ఫ్యూయల్ కప్పా పెట్రోల్ విత్ సీఎన్జీ ఇంజిన్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్) తో ఎక్స్ టర్ లభ్యమవుతుంది.