ఇస్లాంలో లవ్ జిహాద్ అనేదే లేదు... ముస్లింలు వ్యతిరేకించాలి: బాబా రాందేవ్

  • ఓ మీడియా సంస్థకు బాబా రాందేవ్ ఇంటర్వ్యూ
  • లవ్ జిహాద్, మతమార్పిళ్లపై స్పందించిన యోగా గురు
  • మోసంతో మతమార్పిళ్లకు పాల్పడడం తప్పు అని వెల్లడి
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మతమార్పిళ్లు, లవ్ జిహాద్ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏ నాగరిక సమాజంలోనూ మత మార్పిడి అనేది సరైన చర్య కాదని బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. మెరుగైన జీవితం, జీవన ప్రమాణాల కోసం ఆలోచన విధానం మార్చుకోవడంలో తప్పులేదని, కానీ మోసంతో, కుట్రతో, బలవంతంగా, రాజకీయ అజెండాతో మత మార్పిళ్లకు పాల్పడడం తప్పు అని అన్నారు. 

"మతం గురించి చెప్పాల్సి వస్తే... స్వ ధర్మ నిష్ఠ... పర ధర్మ సహిష్ణుత అని చెబుతాను. సొంత మతానికి విధేయులై ఉండడం... ఇతర మతాల పట్ల సహనం పాటించడం దానర్థం. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి... ఇతర మతాల గురించి మనకెందుకు?

లవ్ జిహాద్ అనేది ఏ ఒక్క ప్రాంతానికో పరిమతం కాలేదు... దేశమంతా జరుగుతోంది. లవ్ జిహాద్ అనేది ఒక వాస్తవం. లవ్ జిహాద్ కు పాల్పడేవాళ్లు ఇస్లాంకు చెడ్డపేరు తెస్తున్నారు. ముస్లింలు లవ్ జిహాద్ ను వ్యతిరేకించాలి. ఎందుకంటే ఇస్లాంలో లవ్ జిహాద్ అనేదే లేదు. 

పేరు మార్చుకోవడం, చేతికి కాషాయ కంకణం కట్టుకోవడం... ఓ అమ్మాయిని మోసం చేయడం... ఆపై ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకోవడం... చివరికి ఆమె ఇస్లాం మతంలోకి మారకపోతే 50 ముక్కలు కింద నరికేసి కుక్కలకు ఆహారంగా వేయడం... ఘోరానికి ఇది పరాకాష్ఠగా నిలిచిపోతుంది" అని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. 

దేశంలో మతమార్పిడి వ్యతిరేక చట్టం ఉండక తప్పదని బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు.


More Telugu News