కాజల్ నుంచి 60వ సినిమా .. టైటిల్ పోస్టర్ రిలీజ్ కి రంగం సిద్ధం!

  • తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కాజల్ 
  • సుదీర్ఘమైన కెరియర్ ను చూసిన హీరోయిన్ 
  • 60వ సినిమా షూటింగులో బిజీగా ఉన్న నాయిక
  • రేపు ఖరారు కానున్న టైటిల్  
  • ఆల్రెడీ సెట్స్ పై ఉన్న రెండు భారీ ప్రాజెక్టులు   
వెండితెరపై హీరోయిన్ గా ఛాన్స్ ను సంపాదించుకోవడం .. నిలదొక్కుకోవడం .. సుదీర్ఘకాలం పాటు స్టార్ డమ్ తో కొనసాగడం అంత తేలికైన విషయం కాదు. ఏ భాషలో చూసినా హీరోయిన్స్ మధ్య గట్టిపోటీ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చాలాకాలం పాటు కొనసాగిన కథానాయికగా కాజల్ కనిపిస్తుంది. 

కాజల్ ప్రస్తుతం తన 60వ సినిమా చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఒక హీరోయిన్ ఇంత కెరియర్ ను చూడటం .. ఇన్ని సినిమాలు చేయడం ఆశ్చర్యంగానే చెప్పుకోవాలి. కాజల్ చేస్తున్న తన 60వ సినిమా టైటిల్ ను ... ఆ సినిమా గ్లింప్స్ ను రేపు రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. 

కారు విండోలో నుంచి బయటికి కనిపిస్తూ కాజల్ చేయి .. సైడ్ మిర్రర్ లో ఆమె ఫేస్ ను చూపిస్తూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇది నాయిక ప్రధానమైన సినిమాగా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో కాజల్ ను చూపించనున్నారు. ప్రస్తుతం కాజల్ 'భగవంత్ కేసరి' .. 'ఇండియన్ 2' సినిమాలు చేస్తోంది. 





More Telugu News