డబ్బు తీసుకుని ఓటేస్తే ఇలాగే ఉంటుంది: తమిళ హీరో విజయ్
- తమిళనాడులో 10, 12 తరగతి ర్యాంకర్లకు అవార్డులు
- హాజరైన తమిళ హీరో విజయ్
- ప్రస్తుత రాజకీయాలపై విజయ్ విమర్శలు
- మన కన్నును మనమే పొడుచుకుంటున్నామని వెల్లడి
తమిళనాడులో ఇటీవల 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడగా, మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తమిళ హీరో విజయ్ కి చెందిన పీపుల్స్ మూవ్ మెంట్ సంస్థ అవార్డులు అందించింది. చెన్నైలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో విజయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు ఓటర్లే కారణమని, మనం ఎవరికి ఓటేస్తామో వారే మనల్ని పాలిస్తారని స్పష్టం చేశారు. అసమర్థులు పాలకులు అవుతున్నారంటే అందుకు కారణం ప్రజలేనని, డబ్బు తీసుకుని ఓటేస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితి చూస్తుంటే మన కన్నును మన వేలితో మనమే గుచ్చుకున్నట్టుగా ఉంటుందని విజయ్ విమర్శించారు. మీరే కాబోయే ఓటర్లు... రాబోయే కాలంలో మంచి నేతలను ఎన్నుకోవాలి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన సినిమాల్లో ఏదో ఒక రాజకీయ సందేశం కానీ, రాజకీయాలపై విమర్శలతో కూడిన పాట కానీ ఉంటోంది. సొంత పార్టీ పెడతారన్న వార్తలపై విజయ్ కూడా ఖండించడంలేదు.