ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు.. సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్య

  • సోషల్ మీడియాలో ప్రధాని మోదీపై సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు
  • దేశంలో అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందని వ్యాఖ్య
  • కానీ, ఆర్థిక మంత్రి, ప్రధానికి ఏం చేయాలో తెలియడం లేదని ఆగ్రహం
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న జీడీపీపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు అంటూ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. ‘‘దేశ జీడీపీ ఏటా 10 పది శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీంతో, కేవలం పదేళ్లలోనే నిరుద్యోగిత, పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏం చేయాలో తెలియదు. ఇక ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు..అందుకే ఇలా..’’ అని సంచలన కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.


More Telugu News