ఐఐటీ చదువుకు మధ్యలోనే గుడ్‌బై.. తరువాత 150 రోజుల్లో రూ.256 కోట్ల సంపాదన
- ఐఐటీ చదువుకు మధ్యలోనే గుడ్‌బై చెప్పేసిన రాహుల్ రాయ్
- తనకు ఇష్టమైన ఆర్థికశాస్త్రంలో ప్రముఖ వార్టన్ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా
- అనంతరం, మార్గన్ స్టాన్లీ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం
- అనంతరం భారత్‌లో మరో ఇద్దరితో కలిసి క్రిప్టో ఫండ్ ఏర్పాటు.
- ఆ తరువాత ఐదు నెలలకే తన సంస్థను రూ.256 కోట్లకు మరో సంస్థలో విలీనం
- తద్వారా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయిన వైనం
ఐఐటీ చదువులు..గొప్ప ఉద్యోగం.. ఇది ఒకప్పటి యువత లక్ష్యాలు. నేటి యువత కాస్త డిఫరెంట్. అభిరుచినే వ్యాపారావకాశాలుగా మలుచుకుంటూ రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోతున్నారు నేటి యూత్. ఈ ట్రెండ్‌కు సరైన ఉదాహరణ రాహుల్ రాయ్. ఐఐటీ చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టిన ఈ యువకుడు ఆ తరువాత 150 రోజుల్లో రూ.256 కోట్లు సంపాదించాడు.
చదువుల్లో చురుకుగా ఉండే రాహుల్ ఐఐటీ జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్‌లో చేరాడు. కానీ కొన్ని రోజులకే ఆ చదువులు తనకు సరిపోవని అతడు భావించాడు. దీంతో, ఆ చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి తనకు నచ్చిన ఆర్థికశాస్త్రంపై దృష్టి పెట్టాడు. ఆ తరువాత అమెరికాలోని ప్రముఖ వార్టన్ కాలేజీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన అతడు మోర్గన్ స్టాన్లీ సంస్థలో ఓ ఏడాది పాటు పనిచేశాడు. ఆ తరువాత ఇండియాకు తిరిగొచ్చి మరో ఇద్దరితో సొంతంగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసే సంస్థను ప్రారంభించాడు.
గామా పాయింట్ క్యాపిటల్ పేరిట నెలకొల్పిన ఈ సంస్థ ప్రధానంగా డిజిటల్ ఉత్పత్తులు, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టేది. వారి వ్యూహం ఫలించడంతో సంస్థ చూస్తుండగానే లాభాల బాట పట్టింది. కానీ, సంస్థ ఏర్పాటు చేసిన ఐదు నెలలకే రాహుల్ ముంగిట ఓ అద్భుతమైన ఆఫర్ వచ్చింది. తమ సంస్థను కొనుగోలు చేస్తామంటూ బ్లాక్ టవర్ క్యాపిటల్ ముందుకు రావడంతో వారు కాదనలేదు. దీంతో, రూ.256 కోట్లకు బ్లాక్ టవర్, గామా క్యాపిటల్ సొంతమైంది. ఈ క్రమంలో రాహుల్‌తో పాటూ సంస్థ సహ వ్యవస్థాపకులందరూ రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయారు.