టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు: మరో నిందితుడి అరెస్ట్, కస్టడీ
- మహమ్మద్ ఖలీద్ తో 51కు చేరుకున్న అరెస్టుల సంఖ్య
- ఖలీద్ ను మూడు రోజుల సిట్ కస్టడీకి అప్పగించిన నాంపల్లి కోర్టు
- ఖలీద్ గదిలోనే కంప్యూటర్ ఏర్పాటు చేసి, సమాధానాలు చేరవేసిన రమేష్
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. దీంతో అరెస్టుల సంఖ్య 51కి చేరుకుంది. తాజాగా అరెస్టైన నిందితుడి పేరు మహమ్మద్ ఖలీద్. అతనిని తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సిట్ అధికారులు చంచల్ గూడ జైలు నుండి ఖలీద్ ను కస్టడీకి తీసుకున్నారు. రమేష్ కు ఖలీద్ హైటెక్ కాపీయింగ్ కు సహకరించినట్లుగా సిట్ గుర్తించింది. మలక్ పేటలోని ఖలీద్ గదిలో కంప్యూటర్ ఏర్పాటు చేసి, పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఈ గది నుండి రమేష్ సమాధానాలు చేరవేసినట్లు గుర్తించారు. మరోవైపు, ఈ కేసులో గతంలో 23 మందికి, తాజాగా ఆరుగురుకి బెయిల్ మంజూరైంది.