నేను ల్యాండ్ లార్డ్ ని ... దేవుడి భూములు కబ్జా చేయాల్సిన అవసరం నాకేంటి?: మంత్రి మల్లారెడ్డి

  • తూంకుంట వెంకటేశ్వరస్వామి భూముల కబ్జా వ్యవహారం
  • తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి మల్లారెడ్డి
  • తాను వేల ఎకరాల భూస్వామినని వెల్లడి 
  • తూంకుంట భూములు దేవాదాయశాఖకు చెందినవని స్పష్టీకరణ
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఓ భూకబ్జా వివాదంలో చిక్కుకోవడం తెలిసిందే. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంట పురపాలక పరిధిలో పురాతన వెంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో మల్లన్న గుడి నిర్మించేందుకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేయడం వివాదానికి దారితీసింది. 

ఇక్కడ అనేక దేవాలయాలు ఉండగా, కొత్తగా మరో ఆలయం నిర్మించాల్సిన అవసరం ఏంటని వెంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రశ్నించారు. ఆలయ భూముల విలువ పెరగడంతో కబ్జాదారుల కన్నుపడిందని, ఆలయ భూమి వ్యవహారం కోర్టులో నడుస్తుండగా మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రస్ట్ సభ్యులు ఆరోపించారు. 

దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. దేవుడి భూములు కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తాను ల్యాండ్ లార్డ్ నని, వేల ఎకరాల భూస్వామిని అని తెలిపారు. తూంకుంట వెంకటేశ్వరస్వామి ఆలయ భూములు దేవాదాయశాఖకు చెందినవని వెల్లడించారు.


More Telugu News