ఈ నెల 20న సికింద్రాబాద్ లో జగన్నాథ రథయాత్ర
- జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయంలో 130 ఏళ్లుగా రథయాత్ర
- జనరల్ బజార్, ఎంజీ రోడ్డు మీదుగా రాణిగంజ్ లోని హిల్ స్ట్రీట్ వరకు రథయాత్ర
- రాత్రి పదిన్నర గంటలకు రాణిగంజ్ చేరుకోనున్న రథయాత్ర
- తిరిగి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకు జగన్నాథ ఆలయానికి
జూన్ 20న సికింద్రాబాద్‌లో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు శ్రీ జగన్నాథ స్వామి రామ్‌గోపాల్ ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది. జగన్నాథుడు, భలభద్రుడు, సుభద్రల విగ్రహాలను ఊరేగించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయంలో 130 ఏళ్ల నుండి రథయాత్రను నిర్వహిస్తున్నారు.
ఈ నెల 20న ఉదయం గం.6.15 నిమిషాల నుండి మధ్యాహ్నం గం.1 వరకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నట్లు వెల్లడించారు. సాయంత్రం గం.4కు రథయాత్ర ప్రారంభమై, జనరల్ బజార్ నుండి ఎంజీ రోడ్డు మీదుగా, రాణిగంజ్‌లోని హిల్ స్ట్రీట్ వరకు కొనసాగుతుందన్నారు. రాత్రి గం.10.30 గంటలకు ఈ రథయాత్ర రాణిగంజ్ చేరుకుంటుందని, తిరిగి ఉదయం గం.4కు జగన్నాథ ఆలయానికి రథయాత్ర చేరుకుంటుందన్నారు.