లింగమనేని ఇంటి జప్తు కేసులో పూర్తయిన వాదనలు.. 28న తీర్పు
- విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ
- ఇంటి అటాచ్‌మెంట్‌కు సంబంధించి సీఐడీ ఎస్పీని వివరాలు అడిగిన కోర్టు
- పూర్తి వివరాలతో డాక్యుమెంట్స్ సమర్పించిన విచారణ అధికారి
ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్ ఇంటి జప్తుకు అనుమతి కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా... విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. సీఐడీ ఎస్పీ జయరాజును లింగమనేని ఇంటి అటాచ్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను కోర్టు అడిగింది. కేసు విచారణ అధికారి ఏఎస్పీ కోర్టుకు పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్స్ ను సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 28న ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. లింగమనేని ఇంటి విషయంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఏఎస్పీ కోర్టుకు చెప్పినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు. ఇది క్విడ్ ప్రోకోగా ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నట్లు చెప్పారు.