నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్ మండిపాటు

  • నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీని ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ నిర్ణయం 
  • నెహ్రూ నుండి మోదీ వరకు ప్రధానులు చేసిన సేవలు, సవాళ్లకు సంబంధించినదన్న రాజ్ నాథ్
  • పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం
  • అల్పబుద్ధి, నిరంకుశత్వమన్న ఖర్గే
జవహర్ లాల్ నెహ్రూ అధికారిక నివాసం తీన్ మూర్తి భవన్ లోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నెహ్రూ నుండి మోదీ వరకు ఎంతోమంది ప్రధానులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించి అన్ని విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుందని, అందుకే దీని పేరును మారుస్తూ చేసిన ప్రతిపాదనను స్వాగతించాలని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

అయితే ఈ పేరు మార్పు నిర్ణయంపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఇది వారి అల్పబుద్ధి, నిరంకుశత్వాన్ని తెలియజేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎలాంటి చరిత్రలేనివారే ఇతరుల చరిత్రను చెరిపివేస్తారన్నారు. ఈ మ్యూజియం పేరు మార్చడం తగదని జైరామ్ రమేశ్ అన్నారు.


More Telugu News