రాయలసీమ నుంచి ముందుకు కదలని నైరుతి రుతుపవనాలు
- ఈసారి ఆలస్యంగా వచ్చిన నైరుతి సీజన్
- జూన్ 11న ఏపీని తాకిన రుతుపవనాలు
- రుతుపవనాలు స్తంభించడంతో మండిపోతున్న ఎండలు
- ఏపీలో 231 మండలాల్లో వడగాడ్పులు
- ఈ నెల 18 తర్వాత రాష్ట్రంలో వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఇంకా విస్తరించకపోవడంతో ఎక్కడా వర్షాల జాడే లేదు.
ఈ నెల 11నే ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు రాయలసీమలో స్తంభించిపోయాయి. సీమ నుంచి రుతుపవనాలు ముందుకు కదలకపోవడంతో జూన్ రెండో వారం నాటికి కూడా రాష్ట్రంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణాన్ని మించిన వేడిమితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశంలో సగానికి పైగా ప్రాంతాల్లో విస్తరించాల్సి ఉంది. శ్రీహరికోట, రత్నగిరి వంటి పలు చోట్ల రుతుపవనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పలు రాష్ట్రాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంది.
ముఖ్యంగా, ఏపీలో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 231 మండలాల్లో తీవ్ర స్థాయి వేడిమి నమోదవుతుంది. కాగా, ఈ నెల 18 తర్వాత ఏపీలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని పేర్కొంది.