చంద్రబాబు రాజకీయాలకు కాలం చెల్లింది: ఆదిమూలపు సురేశ్

  • ప్రజలకు జగన్‌ మేలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారన్న ఆదిమూలపు సురేశ్
  • ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని ఆరోపణ
  • అన్ని హంగులతో టిడ్కో ఇళ్లను జగన్‌ పూర్తి చేశారని కితాబు 
ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ మేలు చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. పేద ప్రజల మీద టీడీపీకి ప్రేమ లేదని, ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. సీఎం జగన్‌ సంకల్పం ముందు ఆ కుట్రలు కొట్టుకుపోయాయని, దుష్టశక్తుల శక్తులన్నీ పటాపంచలయ్యాయని అన్నారు.

శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆదిమూలపు సురేశ్ మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారని ఆరోపించారు. ఆయన హయాంలో జరిగిన దోపిడీని ఎల్లో మీడియా ప్రశ్నించదని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఆయనో ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.

అన్ని హంగులతో టిడ్కో ఇళ్లను సీఎం జగన్‌ పూర్తి చేశారని మంత్రి సురేశ్ చెప్పారు. నాయకుడు ఎలా ఉంటాడనే దానికి ఉదాహరణ జగన్‌ అని పొగడ్తలు కురిపించారు. జగన్‌ ప్రభంజనంతో పచ్చపార్టీలో వణుకు పుడుతోందని చెప్పారు. 


More Telugu News