'ఆదిపురుష్' సినిమాకు వచ్చిన కోతి.. వీడియో వైరల్!

  • ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆదిపురుష్'
  • జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్న థియేటర్లు
  • థియేటర్ల వద్ద జాతరను తలపించే వాతావరణం
ఈరోజు సినిమా థియేటర్లన్నీ జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నాయి. ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. థియేటర్ల దగ్గర జాతరను తలిపించే వాతావరణం కనిపిస్తోంది. సినిమాకు రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తుండటంతో ప్రభాస్ అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

ఇంకోవైపు, ప్రతి థియేటర్ లో ఆంజనేయస్వామి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచుతున్నట్టు దర్శకుడు ఓం రౌత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటించిన విధంగానే ప్రతి థియేటర్ లో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచారు. కొన్ని థియేటర్లలో హనుమంతుడి విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇదిలావుంచితే, ఈ సినిమా చూసేందుకు ఒక కోతి థియేటర్ కు రావడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సాక్షాత్తు హనుమంతుడే వచ్చాడని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. 


More Telugu News