కుప్వారాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల హతం
- నియంత్రణ రేఖ సమీపంలో ఈ తెల్లవారుజామున ఘటన
- ఉగ్రవాదులు తచ్చాడుతున్నట్టు సమాచారం
- భద్రతా దళాలపై ఉగ్రవాదుల కాల్పులు
- ఈ నెలలో ఇప్పటి వరకు 9 మంది హతం
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందాలు ఈ తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి.
ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఈ నెల 13న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ నెల 2న రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.