తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆ జీవో బోగస్: బొత్స సత్యనారాయణ

  • బొత్సను కలిసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు
  • ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్
  • 2026లో ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామన్న బొత్స
తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించడం చర్చనీయాంశం అయింది. కాంట్రాక్ట్ వర్కర్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో బోగస్ అని ఆయన అన్నారు. కావాలంటే తెలంగాణకు వెళ్లి పరిశీలించుకోవాలని చెప్పారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఏపీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు విజయనగరంలో బొత్సను కలిశారు. 

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో కేవలం 960 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని... ఇక్కడ తాము 10 వేల మందికి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇవ్వకపోయినా... జగన్ మళ్లీ సీఎం అయిన తర్వాత 2026లో ఈ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోవని, దానికి తాను గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ, తెలంగాణలో ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి సమాధానంగా ఆ జీవో బోగస్ అని, కావాలంటే డబ్బులిచ్చి ఇద్దరిని పంపిస్తానని, అక్కడకు వెళ్లి పరిస్థితిని పరిశీలించుకోవాలని అన్నారు.



More Telugu News