మరింతగా తగ్గనున్న వంటనూనెల ధరలు..!
- రిఫైన్డ్ నూనెలపై దిగుమతి సుంకం 17.5 నుంచి 12.5 శాతానికి తగ్గించిన కేంద్రం
- గురువారం నుంచీ అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
- దీర్ఘకాలంలో దిగుమతులపై ప్రభుత్వ నిర్ణయ ప్రభావం ఉండదంటున్న మార్కెట్ వర్గాలు
ధరాభారంతో అల్లాడుతున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్! దేశంలో వంటనూనెల ధరలు మరింతగా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా శుద్ధి చేసిన (రిఫైన్డ్) వంట నూనెలపై(సోయాబీన్, సన్‌ఫ్లవర్) దిగుమతి సుంకాన్ని తగ్గించింది. గతంలో 17.5 శాతంగా ఉన్న సుంకం ప్రస్తుతం 12.5 శాతానికి చేరుకుంది. గురువారం నుంచే ఈ తగ్గింపు అమల్లోకి రావడంతో త్వరలో వంటనూనెల ధరలు మరింత తగ్గుతాయని ఆర్థిక శాఖ పేర్కొంది.
సాధారణంగా మన దేశం ముడి సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం రిఫైన్డ్ ఆయిల్స్ పైనా సుంకాన్ని తగ్గించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంతో దిగుమతులపై దీర్ఘకాలిక ప్రభావం ఏమీ ఉండదని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా వెల్లడించారు.