'ఆదిపురుష్' థియేటర్ల దాహం తీర్చేనా?
- బాలకృష్ణ హీరోగా చేసిన 'శ్రీరామరాజ్యం'
- ఆ తరువాత రామాయణ నేపథ్యంలో వస్తున్న 'ఆదిపురుష్'
- తొలిసారిగా శ్రీరాముడిగా కనిపించనున్న ప్రభాస్
- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేక ఆకర్షణ
- పిల్లలను ఎక్కువగా ఆకర్షించే 3D ఫార్మేట్
సోషల్ మూవీస్ చేయడానికీ .. పౌరాణికాలు చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. అందునా పోషించేది భగవంతుడి పాత్ర అయినప్పుడు ఆ వైవిధ్యాన్ని ప్రత్యేకంగా చూపించవలసి ఉంటుంది. పైగా ఆ పాత్రను ఇంతకుముందు గొప్ప నటులు పోషించిన తరువాత, మళ్లీ తన మార్కు చూపించడానికి ఏ హీరో అయినా ప్రయత్నిస్తే కచ్చితంగా అది సాహసమే అవుతుంది. అలాంటి ఒక సాహసం చేసిన హీరోగా ప్రభాస్ కనిపిస్తాడు.
తెరపై శ్రీరాముడి పాత్ర ఇలా ఉండాలని చెప్పేసి ఎన్టీ రామారావు కొన్ని లక్షణాలను సెట్ చేసి పెట్టారు. ఆ తరువాత బాలకృష్ణ ఆ మార్క్ ను దాటి వెళ్లకుండా 'శ్రీరామరాజ్యం'లో రాముడిగా మెప్పించారు. ఇప్పుడు అదే శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ 'ఆదిపురుష్' గా వస్తున్నాడు. ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ ఆల్రెడీ కొన్ని పౌరాణిక పాత్రలను చేయడం వలన .. అలాంటి పాత్రల బాడీ లాంగ్వేజ్ .. వాచకం ఆయనకి బాగా తెలుసును గనుక, ప్రేక్షకులు ఆయనను రాముడి పాత్రలో అంగీకరించారు.
కానీ ప్రభాస్ విషయానికి వస్తే ఆయనకీ ఇదే తొలి పౌరాణికం. కాకపోతే ఆయన హైటూ .. పర్సనాలిటీ .. ఇమేజ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కానున్నాయి. బాలకృష్ణ తరువాత శ్రీరాముడి పాత్రను పూర్తిస్థాయిలో చేస్తున్న హీరో ప్రభాస్ అనే చెప్పుకోవాలి. ఇంతకుముందు ఈ నేపథ్యంలో వచ్చిన సినిమాలకీ .. ఈ సినిమాకి ఉన్న తేడా ఏంటంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. అద్భుతమైన విజువల్స్ .. సౌండ్ సిస్టమ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి.
ఇక 3D ఫార్మేట్ లోను ఈ సినిమా కొత్త అనుభూతిని అందించనుంది. రామాయణం ఆధారంగా ఇంతకుముందు రూపొందిన ఏ సినిమా ఈ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఇన్ని థియేటర్స్ లో .. ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కాలేదు. ఆ రకంగా చూసుకుంటే 'ఆదిపురుష్' ఒక అరుదైన రికార్డును దక్కించుకుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. థియేటర్స్ కి వచ్చి చాలాకాలమైన వారిని మళ్లీ బయటికి రప్పించే సినిమాగా .. చాలా కాలం తరువాత థియేటర్ల దాహం తీర్చే సినిమాగా ఇది నిలుస్తుందేమో చూడాలి.