జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్

  • 100 టవర్లను వర్చువల్ గా ప్రారంభించిన జగన్
  • మూరుమూల ప్రాంతాల్లో 4జీ సేవలను అందించేందుకు వీలుగా టవర్ల ఏర్పాటు
  • 209 గ్రామాలకు అందనున్న 4జీ సేవలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జియో టవర్లను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. మూరుమూల ప్రాంతాలకు 4జీ సేవలను అందించేందుకు వీలుగా జియో కొత్తగా 100 టవర్లను ఏర్పాటు చేసింది. వీటిని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా జగన్ ప్రారంభించారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైఎస్సార్ జిల్లాలో 2 టవర్లను ప్రారంభించారు. ఈ టవర్ల ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి. ఈ టవర్లను భవిష్యత్తులో 5జీ సేవలను అందించేందుకు జియో అప్ గ్రేడ్ చేయనుంది.


More Telugu News