కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము: విజయసాయి రెడ్డి

  • ప్రతిపక్ష నాయకులు కులం పేరిట ఓట్లు అడుగుతున్నారన్న విజయసాయి 
  • వైసీపీ కులం, మతం చూడకుండా అందరినీ సమంగా
     చూస్తుందని ట్వీట్
  • ఎన్నికల్లో తమ పార్టీకి పొత్తులు అవసరం లేదని వ్యాఖ్య 
కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేమని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకులు కులం పేరిట ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. వైసీపీ పార్టీ అందరినీ సమానంగా చూస్తుందని చెప్పారు.  ‘కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేము - ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము. విపక్ష నాయకులు తాము ఫలానా కులానికి చెందిన వారమని...కాబట్టి ఆ కులం వారంతా గంపగుత్తగా తమకే ఓటు వేయాలని మైకులు పట్టుకొని మీద పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ మాత్రం కులం, మతం, వర్గం, పార్టీ, ప్రాంతం చూడదు...అందరినీ సమంగా ఆదరిస్తుంది’ అని విజయసాయి ట్వీట్ చేశారు. 

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి పొత్తులు అవసరం లేదని చెప్పారు. ‘మాకు పొత్తులు అవసరం లేదు. వైఎస్ ఆర్సీపీ ప్రజల కోసం కష్టపడి పని చేసింది. ప్రజలు మమ్మల్ని మళ్లీ ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. అలాగే ఏపీలో ప్రతిపక్షాలు కలిసి వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే సున్నా సున్న సున్నా అని ఎప్పుడూ గుర్తుంచుకోండి’ అని చెప్పారు. ప్రతిపక్షాలు సీఎం జగన్ పై విషం చిమ్ముతున్నా, ఆయన మాత్రం  రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాలు,ఉపాధిని సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగనన్న సురక్ష ప్రారంభించడం ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రతిపక్షాలకు, ఆయనకు తేడా అదే అన్నారు.


More Telugu News