రూ.999కే అమెజాన్ ప్రైమ్ లైట్

  • అమెజాన్ ప్రైమ్ కంటే రూ.500 తక్కువ
  • హెచ్ డీ క్వాలిటీ వీడియోలకే అవకాశం
  • అమెజాన్ రీడింగ్, మ్యూజిక్ ప్రయోజనాలు ఉండవు
  • ఏక కాలంలో రెండు పరికరాలపైనే చూడగలరు
అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కోరుకునే వారికి చౌక ధరకు అమెజాన్ లైట్ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఏడాది సభ్యత్వం రేటు ఇప్పటి వరకు రూ.1,499గా ఉంది. అదే నెలవారీ చందా అయితే రూ.299, మూడు నెలలకు రూ.599 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అమెజాన్ లైట్ ఏడాది సభ్యత్వ రుసుం కేవలం రూ.999. అంటే అమెజాన్ ప్రైమ్ రూ.1,499తో పోలిస్తే.. రూ.500 ఆదా చేసుకోవచ్చు. ప్రైమ్ లైట్ లో నెలవారీ, త్రైమాసికం చందాలు లేవు.

ధర తగ్గించారు కనుక ప్రయోజనాల్లో తేడాలు ఏమైనా ఉన్నాయా? అన్న సందేహం రావచ్చు. స్వల్ప మార్పులు ఇందులో చేశారు. రెగ్యులర్ ప్రైమ్ సభ్యులకు అదే రోజు, ఒకటి, రెండు రోజుల ఫాస్ట్ డెలివరీ సేవలు లభిస్తాయి. అదే ప్రైమ్ లైట్ సభ్యులకు అయితే రెండు రోజుల ఫాస్ట్ షిప్పింగ్ సేవలు లభిస్తాయి. ఉచిత స్టాండర్డ్ డెలివరీకి కనీస ఆర్డర్ విలువ కూడా లేదు. 

రెగ్యులర్ ప్రైమ్ సభ్యులకు అమెజాన్ మ్యూజిక్, వీడియోలకు ఉచిత యాక్సెస్ ఉంటుంది. అమెజాన్ లైట్ సభ్యుల మ్యూజిక్ ఉండదు. అపరిమితంగా ప్రైమ్ వీడియోలు చూసుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్ ప్రైమ్ సభ్యులు 4కే క్వాలిటీ వీడియోలు స్ట్రీమింగ్ కు అవకాశం ఉంటే, లైట్ సభ్యులకు హెచ్ డీ క్వాలిటీ వీడియోలకే పరిమితి ఉంటుంది. రెగ్యులర్ ప్రైమ్ సభ్యులు ఏక కాలంలో ఆరు పరికరాలపై ఈ సేవలు పొందొచ్చు. ప్రైమ్ లైట్ సభ్యులు అయితే ఒకేసారి రెండు పరికరాలపై చూడగలరు. ప్రైమ్, ప్రైమ్ లైట్ సభ్యులకు అమెజాన్ ఐసీఐసీఐ కార్డు కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.


More Telugu News