గుడ్ న్యూస్ చెప్పిన కెనడా.. 700 మంది భారతీయులకు ఊరట
- కెనడాలో వలసల కుంభకోణం
- నకిలీ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్లతో భారతీయుల ఎంట్రీ, దేశబహిష్కరణ ప్రమాదం
- ఇప్పటికిప్పుడు భారతీయులను ఇండియాకు పంపించబోమని కెనడా మంత్రి హామీ
- ఒక్కో కేసును పరిశీలించేందుకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్
కెనడాలో దేశబహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న 700 మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికిప్పుడు వారిని కెనడా నుంచి పంపించబోమని హామీ ఇచ్చింది. ఈ మేరకు కెనడా వలసల శాఖ మంత్రి షాన్ ఫ్రేజర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
నకిలీ యూనివర్సిటీ అడ్మిషన్ లేఖలతో కెనడాలో కాలుపెట్టిన భారతీయులు ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. శాశ్వత నివాసార్హత కోసం వారు ఇటీవల దరఖాస్తు చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే, ట్రావెల్ ఏజెంట్ల మోసాలకు కొందరు అమాయక విద్యార్థులు బలై ఉంటారన్న అభిప్రాయంతో ఉన్న కెనడా ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒక్కో విద్యార్థి కేసును పరిశీలించేందుకు వీలుగా ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను తాజాగా రంగంలోకి దిపింది.
‘‘మోసాలకు బలైన అంతర్జాతీయ విద్యార్థులకు కెనడాలో నివసించేందుకు అనుమతి ఇస్తాం. అయితే, అక్రమ మర్గాల్లో కెనడాకు వచ్చిన వారిని మాత్రం ఉపేక్షించం. కెనడా చట్టాల ప్రకారం వారు చేసిన నేరానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని మంత్రి షాన్ ఫ్రేజర్ హెచ్చరించారు. చిక్కుల్లో పడ్డ భారతీయుల్లో అధికశాతం మంది పంజాబ్‌కు చెందిన వారే. దీంతో, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది.