ఎంతోమంది అభిమానించే వ్యక్తిని చేతులు కట్టుకుని తన ముందు నిలుచునేలా చేశాడు: పవన్ కల్యాణ్
- ఎక్కడైనా రెండే కులాలన్న పవన్ కల్యాణ్
- ఒకటి పవర్ ఫుల్, రెండు పవర్ లెస్ అని వివరణ
- సీఎం జగన్ ది పైశాచిక ఆనందం అని విమర్శ
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడని, తనకు తెలిసినంత వరకు రెండే కులాలని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నువ్వెంత పవర్ ఫుల్... నువ్వెంత పవర్ లెస్... ఈ రెండు రకాలే ఉన్నాయని వివరించారు.
"డబ్బు వ్యత్యాసం ఉంటే సరిదిద్దుకోగలం.... కానీ ప్రపంచమంతా పేరుండనీ, ఎంత డబ్బుండనీ... ఈ ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే మాత్రం అయ్యా దొరా అంటూ చేతులు కట్టుకుని నిలుచుకోవాలి... ఇదీ ఫ్యూడలిజం అంటే. ఇలాంటి పోకడలకు నేను వ్యతిరేకం. సొంత చిన్నాన్న చనిపోతే ముందు గుండెపోటు అన్నారు, బాత్రూంలో పడిపోయాడు అన్నారు. సీబీఐ ఓవైపు చెబుతోంది... అన్ని దారులు ఈ ముఖ్యమంత్రి ఇంటివైపే చూపిస్తున్నాయి.... ఎవరు... ఎవరు పాపం పసివాడు ఇక్కడ? నువ్వా... పాపం పసివాడు?
వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఓ వైరాలజిస్ట్. సొంత తండ్రి చనిపోతే, కోర్టులో వాదించడానికి ఆమెకు న్యాయవాది కూడా లేడు... ఆమె సొంతంగా వాదనలు వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బు ఉంటే శక్తిమంతులం అనుకోవడానికి లేదు. మీకు తెలుసు... చాలామంది అభిమానించే వ్యక్తిని చేతులు కట్టుకుని తన ముందు నిలబడేలా చేశాడో... ఎంత పైశాచిక ఆనందం పొందాడో తెలుసు మీకు.
ఒక ముఖ్యమంత్రివి అయితే నీ పని నువ్వు చేసుకో. మా జోలికి రాకు. ముఖ్యమంత్రో, ముఖ్యమంత్రి కుటుంబమో తప్పు చేస్తే తట్టుకోగలం... కానీ ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో ఇదే నమూనాలు కనిపిస్తే మాత్రం ఎదురుతిరగక తప్పదు. కనీసం డిగ్రీ చదవని పవన్ కల్యాణే ఎదురు తిరిగాడంటే మీరెందుకు ఎదురుతిరగలేరు?" అంటూ పవన్ ప్రసంగించారు.