జమ్మూలో ఒకేరోజు 4సార్లు కంపించిన భూమి

  • తెల్లవారుజామున గం.2.20 నిమిషాలకు మొదటసారి ప్రకంపనలు
  • పది కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తింపు
  • నిన్న ఉత్తరాదిన పలుచోట్ల కంపించిన భూమి
జమ్మూలో ఒకేరోజు నాలుగుసార్లు భూమి కంపించింది. ఇక్కడి కిశ్త్వాడ్ లో బుధవారం ఉదయం గం.8.29 సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.3గా నమోదయింది. ఐదు కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అంతకుముందే డోడా జిల్లాలో ఉదయం గం.7.56 సమయానికి భూకంపం సంభవించింది. పది కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెల్లవారుజామున గం.2.20 సమయానికి ఇదే ప్రాంతంలో 4.3 తీవ్రతతో, ఆ తర్వాత గం.2.34 గంటలకు రైసీ జిల్లాలోని కాట్రాలో 2.8 తీవ్రతతో భూమి కంపించింది. ఒకేరోజు నాలుగుసార్లు భూమి కంపించడం ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. నిన్న ఉత్తర భారతంలోని పలుచోట్ల భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.


More Telugu News