స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 85 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 40 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • వడ్డీ రేట్లపై ఫెడ్ రిజర్వ్ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయిన మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం ఈ రాత్రికి వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్లు లాభపడి 63,229కి చేరుకుంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 18,756 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (2.39%), టాటా మోటార్స్ (1.49%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.42%) రిలయన్స్ (1.28%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.09%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-0.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.98%), యాక్సిస్ బ్యాంక్ (-0.95%), భారతి ఎయిర్ టెల్ (-0.66%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.49%).


More Telugu News