అమెరికాలో మినీ ఐపీఎల్.. బరిలోని జట్లు ఇవే
- మేజర్ లీగ్ క్రికెట్ పేరిట టోర్నీ నిర్వహణ
- రేపటి నుంచి మ్యాచ్ లు
- నాలుగు జట్లను కొన్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
అమెరికాలో ఐపీఎల్ జట్లు సందడి చేయనున్నాయి. అగ్రరాజ్యంలో ఐపీఎల్ తరహాలో శుక్రవారం నుంచి మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)జరగనుంది. మినీ ఐపీఎల్ గా భావిస్తున్న ఈ టోర్నీలో ఆరు జట్లు పోటీ పడనున్నాయి. వీటిలో నాలుగు జట్లను ఐపీఎల్ లోని ప్రధాన ఫ్రాంచైజీలైన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకున్నాయి. మిగిలిన రెండు జట్ల యజమానులు కూడా భారత సంతతి వ్యక్తులే. టెక్సాస్ సూపర్ కింగ్స్ (సీఎస్కే), లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ (కేకేఆర్), సియాటెల్ ఆర్కాస్ (డీసీ), ఎంఐ న్యూయార్క్ (ఎంఐ)తో పాటు వాష్టింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్లు ఈ లీగ్ లో పోటీ పడనున్నాయి. సియాటెల్ ఫ్రాంచైజీలో ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా సహ యజమానిగా ఉండటం గమనార్హం.
ఈ లీగ్ లో ప్రపంచ వ్యాప్తంగా పలువురు స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. జేసన్ రాయ్, మార్కస్ స్టోయినిస్, ఆరోన్ ఫించ్, క్వింటన్ డికాక్, మిచెల్ మార్ష్, ఆన్రిచ్ నోర్జ్, వానిందు హసరంగ తదితర ప్లేయర్లు ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మధ్య భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం తొలి మ్యాచ్ జరగనుంది. జులై 25 వరకు లీగ్ దశ మ్యాచ్ లు ముగుస్తాయి. జులై 27న ఎలిమినేటర్, అదే రోజున క్వాలిఫయర్ జరుగుతాయి. 28న ఛాలెంజర్, జులై 30న చాంపియన్షిప్ (ఫైనల్) నిర్వహిస్తారు.