'భోళాశంకర్'లో ఆ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయట!

  • 'భోళాశంకర్'గా చిరంజీవి 
  • కామెడీ ట్రాక్ హైలైట్ అంటూ టాక్ 
  • మెహర్ రమేశ్ దర్శకత్వం  
  • ఆగస్టు 11వ తేదీన సినిమా విడుదల
చిరంజీవి అనగానే ముందుగానే గుర్తొచ్చేవి ఆయన డాన్సులు .. ఫైట్లు. ఆయన ఎంత ఫాస్టుగా స్టెప్పులు వేస్తున్నా ఎక్స్ ప్రెషన్ మిస్సవ్వదు. ఇక ఆయన ఫైట్లు చేస్తుంటే, నిజంగానే కొట్టేస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. యాక్షన్ సీన్స్ లో విజృంభిస్తూ అంత సహజత్వాన్ని తీసుకురావడం ఆయన ప్రత్యేకత. 

ఈ రెండూ కాకుండా ఆయన గొప్పగా నటించే అంశాలు రెండు కనిపిస్తాయి. ఫుల్లుగా తాగేసి రొమాంటిక్ సీన్స్ లో కాలర్ చాటున ముఖం దాచుకుని సిగ్గుపడిపోయే సన్నివేశాల్లోను .. కామెడీ చేయడంలోను ఆయన మార్క్ ను ఎవరూ అందుకోలేరు. అలా ఆయన మార్క్ సీన్స్ ఈ మధ్య కాలంలో తెరపై కనిపించలేదు. 'భోళా శంకర్' ఆ లోటు తీరుస్తుందని టాక్. 

ఈ సినిమాలో వెన్నెల కిశోర్ .. హైపర్ ఆది .. సత్య కాంబినేషన్లో వచ్చే చిరూ కామెడీ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అనిల్ సుంకర నిర్మాణంలో .. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా .. కీర్తి సురేశ్ ముఖ్యమైన పాత్రలలలో కనిపించనున్నారు. 



More Telugu News