తెలంగాణ, ఏపీలలో ఆదిపురుష్ టిక్కెట్ ధరల పెంపుకు ఒకే!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్‌పై రూ.50 పెంపుకు అనుమతి
- థియేటర్ లో ఆరో షోకు కూడా అనుమతి
- ఆంధ్రప్రదేశ్ లో అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది
ప్రభాస్ కీలకపాత్రలో విడుదలకు సిద్ధమైన ఆదిపురుష్ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్‌పై రూ.50 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే మొదటి మూడు రోజులు మాత్రమే పెంపుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే థియేటర్లలో ఆరో షోకు ఓకే చెప్పింది. ఉదయం నాలుగు గంటల నుండి ఆదిపురుష్ సినిమాను థియేటర్ లలో ప్రదర్శించవచ్చు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ప్రస్తుతం టిక్కెట్ ధర రూ.175 ఉండగా.. రూ.50 వరకు పెంచుకోవచ్చు. 3డీ గ్లాస్ ల ఛార్జ్ వసూలు చేయనున్నారు. ఏపీలోను టిక్కెట్ ధరను రూ.50 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.