ఎయిరిండియా కాక్‌పిట్‌లోకి స్నేహితురాలు.. పైలట్, కో-పైలట్‌పై చర్యలు!
- జూన్ 3వ తేదీన ఢిల్లీ - లెహ్ విమానంలో ఘటన
- టేకాఫ్ అయిన కాసేపటికే కాక్ పిట్ లోకి వెళ్లిన స్నేహితురాలు
- క్యాబిన్ సిబ్బంది ఫిర్యాదుతో బయటకు
- పైలట్, కో-పైలట్ లను విధుల నుంచి తప్పించిన ఎయిరిండియా
ఢిల్లీ - లెహ్ ఎయిరిండియా విమానంలో జూన్ 3వ తేదీన ఇద్దరు పైలట్లు కాక్‌పిట్ లోకి స్నేహితురాలిని ఆహ్వానించారు. ఈ ఘటనపై ఎయిరిండియా కఠిన చర్యలు చేపట్టింది. గత ఆరు నెలల్లో ఎయిరిండియా విమానంలో ఇలా జరగడం ఇది రెండోసారి. గతవారం ఢిల్లీ నుండి లెహ్ వెళ్లిన ఎయిరిండియా ఏఐ 445 విమానంలో ఈ సంఘటన జరిగింది. ఈ విమాన ప్రయాణికుల్లో ఒకరు పైలట్, కో-పైలట్ కు స్నేహితురాలు. దీంతో విమానం టేకాఫ్ అయిన కాసేపటికి నిబంధనలకు విరుద్ధంగా ఆమెను కాక్ పిట్ లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత క్యాబిన్ సిబ్బంది ఫిర్యాదుతో ఆమె బయటకు వచ్చింది.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎయిరిండియా కఠిన చర్యలు చేపట్టింది. పైలట్, కో-పైలట్ లను విధుల నుండి పక్కన బెట్టిన ఎయిరిండియా ఘటనపై దర్యాఫ్తు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, దీనిపై ఎయిరిండియా నుండి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా, ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నామని డీజీసీఏ తెలిపింది.