రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం.. 'జేడీఎస్-బీజేపీ' బంధం వార్తలపై బసవరాజ్ బొమ్మై
- బీజేపీకి జేడీఎస్ దగ్గరవుతోందంటూ వార్తలు
- ప్రస్తుతానికి జేడీఎస్ తో ఎలాంటి చర్చలు జరగలేదన్న మాజీ సీఎం
- రాజకీయ భవిష్యత్తును అంచనా వేయడం కష్టమన్న నేత
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీకి జేడీఎస్ దగ్గరవుతున్నదనే వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై మాజీ సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రస్తుతానికి జేడీఎస్ తో ఎలాంటి చర్చలు జరగలేదని, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు.
రాజకీయ భవిష్యత్తును అప్పుడే అంచనా వేయడం కష్టమన్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాల తర్వాత బీజేపీతో జేడీఎస్ పొత్తు కోసం చూస్తోందంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జేడీఎస్ నేత కుమారస్వామి తన ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలను కలిశారు.