ఏపీలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాల వెల్లడి
- ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సప్లిమెంటరీ ఫలితాల విడుదల
- మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
- సప్లిమెంటరీ పరీక్షలకు 4 లక్షల మంది విద్యార్థుల హాజరు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను నేడు విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఈ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ/ఇంప్రూవ్ మెంట్ పరీక్షల ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు.
విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ పోర్టల్ ను సందర్శించడం ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేస్తే మార్కుల వివరాలు వెల్లడవుతాయి.
కాగా, మే 24 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/వొకేషనల్ సప్లిమెంటరీ-ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4 లక్షల మందికి పైగా హాజరయ్యారు.