ఒడిశా టాటా స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం, పలువురికి గాయాలు
- ప్రమాద ఘటనలో 19 మందికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం
- క్షతగాత్రులు కటక్ ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
- ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన టాటా స్టీల్స్
ఒడిశాలోని డెంకనాల్ టాటా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మేరమండల్ ప్రాంతంలో టాటా స్టీల్ కు చెందిన బ్లాస్ట్ ఫర్నేస్ పవర్ ప్లాంట్ లో స్టీమ్ లీక్ అయింది. ఈ ఘటనలో 19 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను కటక్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానిక కలెక్టర్ ఈ ప్లాంట్ వద్దకు చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. వేడి నీటితో ఉన్న వాల్వ్ ప్రమాదవశాత్తు తెరుచుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని డెంకనాల్ ఎస్పీ తెలిపారు.
ప్రమాదంపై టాటా స్టీల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. టాటా స్టీల్ వర్క్స్ పరిశ్రమలో బీఎఫ్‌పీపీ2 పవర్ ప్లాంట్ వద్ద స్టీమ్ లీక్ కావడం వల్ల ప్రమాదం జరిగిందని, మంగళవారం మధ్యాహ్నం గం.1 సమయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ప్రమాదం జరగ్గానే వెంటనే అన్ని అత్యవసర ప్రోటోకాల్ సర్వీసులను యాక్టివేట్ చేశామని, ఘటన జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేశామని, బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని ప్రకటించింది. ఈ ఘటనపై అంతర్గత దర్యాఫ్తును ప్రారంభించింది కంపెనీ.