తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల తర్వాతే వాతావరణ మార్పు

  • ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
  • ఇంకా ప్రారంభం కాని వర్షాలు
  • మరో రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వడగాడ్పులు కొనసాగుతాయన్న ఐఎండీ
ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, పూర్తిస్థాయిలో వర్షాలు ఇంకా ప్రారంభం కాలేదు. దీనిపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) స్పందించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల తర్వాతే వాతావరణ మార్పు ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. అప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు కొనసాగుతాయని వివరించింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సాధారణ పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 40 డిగ్రీల వరకు ఉండొచ్చని పేర్కొంది. 

రెండ్రోజుల తర్వాత అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణ దక్షిణ ప్రాంతంపై నైరుతి రుతుపవనాల ప్రభావం జూన్ 15 లేదా 16వ తేదీ నుంచి ఉంటుందని తెలిపింది.


More Telugu News