ఆశ్చర్యంగా ఉందే..? పామును తింటున్న జింక.. ఇదిగో వీడియో

  • జింకలు సాధు జంతువు అనుకుంటే పొరపాటే..!
  • అవి అప్పుడప్పుడు ఇలా పాముల్ని లాగించేస్తాయ్
  • చిన్నపాటు పురుగులు, పక్షులను కూడా తింటాయట
జింక గడ్డి తినే సాధు జంతువు అని మనకు తెలుసు. గడ్డి, చెట్ల ఆకులను తినే శాకాహార జీవి ఇది. కడుపు మాడితే తినడానికి ఏదో ఒకటి అన్నట్టు.. అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు, పక్షులను జింకలు తిన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ లేనట్టు ఓ జింక ఏకంగా పామును తింటూ కనిపించింది. జంతు ప్రేమికులు ఈ వీడియో క్లిప్ చూసి నోరెళ్లబెడుతున్నారు. 

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఫిజెన్ అనే ట్విట్టర్ యూజర్ దీన్ని షేర్ చేసింది. ‘‘జింక పామును తినడం నేను మొదటి సారి చూశాను. జింకలు గడ్డిని తినవా?" అంటూ ఆమె ట్వీట్ చేసింది. కానీ, ట్విట్టర్ యూజర్లలో కొందరు అరుదుగా జింకలు ఇలాంటివి కూడా తింటాయంటూ కామెంట్ చేస్తున్నారు. అవి వెరైటీ కోసం చిన్న పక్షులు, పురుగులు, క్షీరదాలను తింటాయనే సమాచారాన్ని షేర్ చేస్తున్నారు.


More Telugu News