బంగ్లాదేశ్ ప్రధాని నుంచి మమతా బెనర్జీకి భారీ తీపి బహుమతి!
- 600 కిలోల మామిడి పండ్లను మమతకు గిఫ్ట్ గా పంపిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా
- దౌత్య సంబంధాల్లో భాగంగా పంపామన్న బంగ్లా డిప్యూటీ హై కమిషన్
- ఈశాన్య రాష్ట్రాల సీఎంలకూ బహుమతులు అందజేసినట్లు వెల్లడి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓ దేశ ప్రధాని నుంచి భారీ గిఫ్ట్ వచ్చింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సుమారు 600 కిలోల మామిడి పండ్లను మమతకు బహుమతిగా పంపారు. ‘‘మమతకు షేక్ హసీనా పంపిన పండ్లలో హిమసాగర్, లంగ్రా రకాలు ఉన్నాయి. దౌత్యపరమైన సంబంధాల్లో భాగంగా ఈ గిఫ్ట్‌ను అందజేశారు. గత ఏడాది కూడా పండ్లను పంపారు’’ అని బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అందరికీ మమిడి పండ్లను బహుమతిగా హసీనా పంపారు. నిజానికి బంగ్లా పీఎం మామిడి పండ్ల దౌత్యం ఇదే తొలిసారి కాదు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బెంగాల్, త్రిపుర, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పండ్లను గిఫ్ట్‌గా అందజేశారు.