నిక్ జోనాస్ - ప్రియాంకా చోప్రా తనయ మాల్టీకి ఎవరి పోలిక?

  • అచ్చం తండ్రి పోలికేనంటున్న ఎక్కువ మంది
  • ప్రియాంకా పోలికలు కూడా ఉన్నాయనే అభిప్రాయం
  • ఇద్దరి పోలికలతో కూడిన అచ్చమైన ప్రతిరూపమంటూ కామెంట్లు
నటుడు, గాయకుడు నిక్ జోనాస్ తన కుమార్తె మాల్టీ మ్యారీతో కలసిన ఫొటోను షేర్ చేశాడు. తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. నిక్ జోనాస్, ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా ముద్దుల తనయే ఈ మాల్టీ మ్యారీ. నిక్ జోనాస్ తన కుమార్తెను స్పష్టంగా చూపించడం ఇది రెండోసారి. అయితే, పాప ఫొటో చూసిన వారికి ముందుగా వచ్చే సందేహం ఆమె పోలిక ఎవరిది? జోనాస్ లేదా ప్రియాంక చోప్రాలో ఎవరి పోలికలు ఆమెకు ఎక్కువగా ఉన్నాయనే సందేహం అభిమానుల్లో రావడం సహజం.

ఇన్ స్టా గ్రామ్ లో అభిమానుల స్పందన చూస్తే దీనిపై కొంత స్పష్టత వస్తుంది. మాల్టీని జోనాస్ కు ట్వీన్ గా అభివర్ణిస్తున్నారు. డాడీ మాదిరే కుమార్తె కూడా అని మరో అభిమాని కామెంట్ చేశాడు. ‘‘ఆమె ముఖం, చెవులు, చర్మం అచ్చం నీ మాదిరే ఉన్నాయి’’ అని మరో యూజర్ పేర్కొన్నాడు. అంతేకాదు మరో గాయని అలీషా చినాయ్ స్పందిస్తూ.. అంతా నాన్న పోలికేనంటూ కామెంట్ పోస్ట్ చేసింది. మాల్టీలో కొన్ని పోలికలు ఆమె తల్లి ప్రియాంకావి కనిపిస్తున్నాయంటూ మరో అభిమాని స్పందన వ్యక్తం చేశాడు. మరో కామెంట్ లో ఇద్దరి పోలికలతో కూడిన అచ్చమైన ప్రతిరూపమని పేర్కొనడం గమనార్హం. ప్రియాంకా, నిక్ జోనాస్ 2018లో పెళ్లి చేసుకున్నారు. గతేడాది వీరి జీవితంలోకి మాల్టీ అడుగు పెట్టింది. ప్రియంకా, నిక్ జోనాస్ చిన్న నాటి ఫొటోలను చూసి గుర్తు పట్టగలరేమో ట్రే చేయండి.

 


More Telugu News