25 సంవత్సరాల తర్వాత తొలిసారి గుజరాత్‌ను తాకుతున్న అతి తీవ్ర తుపాను

  • అరేబియా సముద్రంలో 58 ఏళ్ల తర్వాత పుట్టిన మూడో అతి తీవ్ర తుపానుగా ‘బిపర్‌జోయ్’
  • 58 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో పుట్టిన మూడో అతి తీవ్ర తుపాను
  • 132 ఏళ్లలో గుజరాత్‌ను తాకిన 16 అల్పపీడనాలు, తుపాన్లు
అతి తీవ్ర తుపానుగా మారి ఎల్లుండి గుజరాత్ వద్ద తీరం దాటనున్న బిపర్‌జోయ్.. 25 ఏళ్ల తర్వాత తొలిసారి గుజరాత్‌ను తాకనున్న తుపానుగా రికార్డులకెక్కబోతోంది. అంతేకాదు, గంటకు 48-63 కిలోమీటర్లు, అంతకంటే వేగంతో గాలులు వీస్తూ తీరం దాటనున్న ఐదో తుపాను ఇదేనని భారత వాతావరణశాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో 58 ఏళ్ల తర్వాత పుట్టిన మూడో అతి తీవ్ర తుపాను ఇదే కావడం గమనార్హం. 

గంటకు 90 నుంచి 119 కిలోమీటర్ల వేగంతో సౌరాష్ట్ర-కచ్‌, పాకిస్థాన్‌లోని మాండ్వి, గుజరాత్‌, కరాచీ మధ్య పాకిస్థాన్, గుజరాత్‌లోని జాఖౌ పోర్టు సమీపంలో గురువారం మధ్యాహ్నానికి అతి తీవ్రమైన తుపానుగా మారుతుందని అంచనా. ఆ సమయంలో గాలి వేగం గంటకు 125-35 కిలోమీటర్లుగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.

1981 తర్వాత 5 మాత్రమే ‘తీవ్ర తుపాన్లు’ (గాలి వేగం గంటకు 89-17 కిలోమీటర్లు) గుజరాత్ తీరాన్ని తాకాయి. ఇవన్నీ 1900 సంవత్సరం తర్వాత పుట్టినవే. ఎక్కువ తీవ్రత కలిగిన ఈ తుపాన్లు 1920, 1961, 1964, 1996, 1998లో సంభవించాయి. మొత్తంగా 132 ఏళ్లలో అరేబియా సముద్రంలో ఏర్పడిన 16 అల్పపీడనాలు, తుపాన్లు గుజరాత్ తీరాన్ని తాకాయి.


More Telugu News