బాత్రూమ్‌లో కలిసి స్నానం చేస్తూ, యువ జంట దుర్మరణం
- బెంగళూరులో వెలుగు చూసిన ఘటన
- శనివారం రాత్రి కలిసి స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లిన యువ జంట
- గీజర్ లోంచి గ్యాస్ లీక్ కావడంతో స్పృహ తప్పి పడిపోయిన వైనం
- కొద్దిసేపటికే దుర్మరణం
కొన్ని రోజుల్లో వివాహం చేసుకోబోతున్న ఓ యువ జంటను విధి కాటేసింది. బాత్రూమ్‌లో కలిసి స్నానం చేసేందుకు వెళ్లిన వారు గీజర్‌లోంచి గ్యాస్ లీక్ కావడంతో దుర్మరణం చెందారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్(30), బెళగావి జిల్లాకు చెందిన సుధారాణి(22) సహజీవనం చేస్తున్నారు. బెంగళూరులో ఉంటూ ఓ హోటల్‌లో పని చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని కూడా వారు నిర్ణయించుకున్నారు.
కాగా, శనివారం రాత్రి స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లిన వారిద్దరూ కిటికీ మూసేశారు. అయితే, వారు స్నానం చేస్తుండగా గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీక్ అయ్యింది. దీంతో, స్పృహ తప్పి పడిపోయిన వారు ఆ తరువాత కాసేపటికి మృతి చెందారు. ఆదివారం ఆ జంట డ్యూటీకి రాకపోయేసరికి సహోద్యోగులు వారి ఇంటికి వెళ్లారు. ఎన్నిమార్లు తలుపుకొట్టినా స్పందన లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూమ్‌లో వారి మృతదేహాలు కనిపించాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.