‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్: మ‌నోజ్ బాజ్‌పాయి

  • వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ 
  • లాయర్ పాత్రను పోషించిన మనోజ్ బాజ్ పాయి
  • థియేటర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్
  • హర్షాన్ని వ్యక్తం చేసిన మనోజ్ బాజ్ పాయి  
  • బెస్ట్ కోర్టు రూమ్ డ్రామాగా నిలిచిందని వెల్లడి 
ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిన కూడా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు పొందిన న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి. ఆయన ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెబ్ ఒరిజిన‌ల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. ఈ సినిమాను వినోద్ భన్సాలి, క‌మ‌లేష్ భ‌న్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ నిర్మించారు. అపూర్వ సింగ్ క‌ర్కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 
హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందడంతో, జూన్ 7న తెలుగు, త‌మిళంలోనూ రిలీజ్ చేశారు. అమేజింగ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ రోజున (సోమ‌వారం) ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విల‌క్ష‌ణ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి మాట్లాడుతూ ..‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. 

 ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రం ఇంత పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని మేం ముందుగా ఊహించ‌లేదు. అందులో భాగంగా అంద‌రం ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా చేశాం. అలాగే ఆ దేవుడు ద‌య కూడా తోడు కావటంతో ఓ  మంచి సినిమాను అందించామ‌ని భావిస్తున్నాను. ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వస్తోంది. కొంద‌రైతే రెండు, మూడు సార్లు చూస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌ వారికి బాగా నచ్చింది.

 మా డైరెక్ట‌ర్ అపూర్వ‌సింగ్ క‌ర్కి అయితే క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ కోసం మూడు నాలుగు కెమెరాలు పెట్టారు. సింగిల్ టేక్‌లో ఏడు పేజీలున్న మోనోలాగ్‌ను కంప్లీట్ చేయాల‌ని నాతో అన్నారు. అందుకు నేను రెండు రోజుల పాటు బాగా ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది. ఈ చిత్రంలో నేను చేసిన 'సోలం' అనే లాయ‌ర్ పాత్ర కామ‌న్ మ్యాన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అందుక‌నే ఆ పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలున్నప్ప‌టికీ దాన్ని చిరున‌వ్వుతో ఎదుర్కొనే సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లంద‌రికీ ఈ పాత్ర ఓ ఉదాహ‌ర‌ణ‌. 

‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ కాన్సెప్ట్‌ను మ‌న చుట్టూ జ‌రుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా త‌యారు చేశాం. అయితే ప్ర‌ధానంగా ఈ  సినిమా అంతా 16 ఏళ్ల అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఆమె త‌న జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులను ... ఆమెకు సోలంకితో ఉన్న అనుబంధాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేశాం. 

 ఏ ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌కైనా న్యాయ వ్య‌వ‌స్థే మూల‌స్తంభంలాంటిది. అందుక‌నే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రాన్ని లాయ‌ర్స్‌కి, న్యాయ వ్య‌వ‌స్థ‌కి అందించిన నివాళిగా భావిస్తున్నాం. సోలంకి పాత్ర‌లో న‌టించ‌టానికి చాలా హోం వ‌ర్క్ చేశాను. స్క్రిప్ట్ మొత్తం ప‌దే ప‌దే చ‌దివాను. ముఖ్యంగా లాయ‌ర్ రోల్ ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంది.. మాట్లాడుతుంది .. ఇలా ప్ర‌తీ చిన్న విష‌యాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాను. నాకు నేనుగా ఆ పాత్ర‌కు మ‌న‌సులో ఓ రూపంలో క్రియేట్ చేసుకుని దాన్ని ప్రొజెక్ట్ చేశాను 

 హిందీలో అయితే  ఈ సినిమా ఓ హిస్ట‌రీ క్రియేట్ చేసింది. ఎందుకంటే ముందు ఓటీటీలో విడుద‌లైన త‌ర్వాత ప్రేక్షుల రిక్వెస్ట్ మేర‌కు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్స్‌లో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు స‌హా ఇత‌ర రీజ‌న‌ల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశాం. జీ 5 వారు ఈ సినిమాను చూడ‌గానే న‌చ్చింది. అందుక‌నే వారు దాన్ని ఓటీటీలో వీలైనంత ఎక్కువ మందికి రీచ్ చేయించాల‌ని ప్ర‌య‌త్నించారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలుగు, త‌మిళ‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. 

ఇప్పటి వరకు మన సినిమాల్లో చాలా కోర్ట్ రూమ్ డ్రామాస్ వచ్చాయి. మా సినిమా విషయానికి వచ్చేసరికి మేం లార్జర్‌దేన్ లైఫ్‌గా చేయాల‌నుకోలేదు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చూపించాల‌నుకున్నాం. దీన్ని ఒక క‌మ‌ర్షియ‌ల్ మూవీగా కూడా చేసి ఉండొచ్చు. కానీ.. మేం అలా చేయాల‌నుకోలేదు. ఓ ఎక్స్‌పెరిమెంట్‌లాగానే చేశాం. ఆ ప్ర‌య‌త్నం వ‌ల్ల‌నే బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీగా అంద‌రూ చెబుతున్నారు. 

‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రంలో నేను కాకుండా మ‌రో తెలుగు న‌టుడు ఎవ‌రైతే బావుంటుంద‌ని ఆలోచిస్తే.. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాయ‌ర్‌గా చేసి మెప్పించారు. మ‌హేష్ బాబు అయితే ఈ పాత్ర‌కు సూట్ అవుతార‌నిపిస్తోంది. సినిమా షూటింగ్స్ లేన‌ప్పుడు పుస్త‌కాలు చ‌దువుతుంటాను. ఫ్యామిలీతో గ‌డుపుతుంటాను. హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు రాయ‌ల‌సీమ రుచులుకి వెళుతుంటాను. ఎందుకంటే నేను ఎక్కువ‌గా స్పైసీ ఫుడ్‌ను ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే బిర్యానీని కూడా ఇష్టంగా తింటాను?" అంటూ చెప్పుకొచ్చారు. 



More Telugu News