జులై 4న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు

  • బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో బోర్డు రద్దు
  • కొత్త బోర్డు సభ్యులు, చైర్మన్ కోసం ఎన్నికలు
  • రిటర్నింగ్ ఆఫీసర్ గా మహేశ్ మిట్టల్ కుమార్
భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యుఎఫ్‌ఐ) ఎన్నికలను జులై 4వ తేదీన నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం సిద్ధమవుతోంది. డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ బోర్డును రద్దు చేసింది. దీంతో కొత్త బోర్డు సభ్యులు, చైర్మన్ ను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ మహేశ్ మిట్టల్ కుమార్ ను రిటర్నింగ్ ఆఫీసర్ గా నియమించింది. డబ్ల్యుఎఫ్‌ఐ స్పెషల్ జనరల్ మీటింగ్ లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.


More Telugu News