లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 99 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 38 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • రెండున్నర శాతానికి పైగా పెరిగిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ నిమిషాల వ్యవధిలోనే లాభాల్లోకి మళ్లింది. ఆ తర్వాత చివరి వరకు లాభాల్లోనే కొనసాగింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడి 62,724కి పెరిగింది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని 18,601 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.58%), ఇన్ఫోసిస్ (2.05%), ఎన్టీపీసీ (1.64%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.26%), టీసీఎస్ (1.19%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.25%), ఎల్ అండ్ టీ (-1.04%), టైటాన్ (-0.82%), మారుతి (-0.80%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.62%).


More Telugu News