బీజేపీ హైకమాండ్ చంద్రబాబు ట్రాప్ లో పడిపోయింది: వైవీ సుబ్బారెడ్డి
- తొమ్మిదేళ్ల మోదీ పాలనలో ఏపీకి ఏం చేశారో చెప్పాలన్న సుబ్బారెడ్డి
- పసుపు కండువాలను మార్చిన వారి మాటలను అమిత్ షా నమ్ముతున్నారని వ్యాఖ్య
- టీడీపీ హయాంలో జరిగిన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని ఆరోపణ
బీజేపీపై వైసీపీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శలు గుప్పించారు. తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఏపీకి బీజేపీ ఏం చేసిందో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఏం చేశారో చెప్పిన తర్వాతే బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే బాగుంటుందని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని అడిగారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా... ఏపీలో 20 పార్లమెంటు సీట్లు కావాలని అమిత్ షా అడుగుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ హైకమాండ్ చంద్రబాబు ట్రాప్ లో పడిపోయిందని అన్నారు. పసుపు కండువాను మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వారి మాటలను అమిత్ షా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధితో పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశారని దుయ్యబట్టారు.