'సైతాన్'పై విమర్శలు.. స్పందించిన మహి వి రాఘవ్!

  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో 'సైతాన్'
  • ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ 
  • కంటెంట్ విషయంలో విమర్శలు 
  • సమాజంలో రెండో కోణం కూడా ఉందన్న దర్శకుడు  
'ఆనందో బ్రహ్మ' .. 'యాత్ర' వంటి సినిమాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహి వి రాఘవ్, 'సైతాన్' అనే వెబ్ సిరీస్ ద్వారా ఈ నెల 15వ తేదీన పలకరించనున్నాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ నుంచి ఇటీవల ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్ లోని హింస .. బూతుల పట్ల విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహి వి.రాఘవ్ మాట్లాడుతూ ... "ఈ సిరీస్ లో బూతులు .. హింస గురించి అంతా మాట్లాడుతున్నారు. సమాజంలో మంచి మాత్రమే కాదు .. చెడు కూడా ఉంది. దానిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందరూ మంచివారే ఉంటే .. మరి చెడు ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది .. ఒకసారి ఆలోచించండి" అన్నారు. 

"ఈ కథలో నేను సృష్టించుకున్న ప్రపంచాన్ని బట్టి నేను చూపించిన విధానం నాకు కరెక్టు అనిపించింది. మోషన్ పోస్టర్ .. ట్రైలర్ తోనే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండనుందనేది జనాలకు అర్థమైపోతుంది. ఎవరూ చూడకూడని వెబ్ సిరీస్ అంటారు .. ట్రైలర్ మాత్రం ట్రెండ్ అవుతోంది. ఏ కథ విషయంలోనైనా నచ్చేవాళ్లు ఉంటారు .. నచ్చని వాళ్లూ ఉంటారు" అని చెప్పుకొచ్చాడు.



More Telugu News