తాళ్లు లేకుండా 123 అంతస్తుల భవనాన్ని సగం వరకు ఎక్కేసిన యువకుడి అరెస్ట్!
- సియోల్‌లో 123 అంతస్తుల లొట్టో వరల్డ్ టవర్
- గంటపాటు ఎక్కి 73వ అంతస్తుకు
- కిందికి దించి అరెస్ట్ చేసిన పోలీసులు
- గతంలో యువకుడు లండన్‌లో ఓ భవనం ఎక్కి జైలు పాలైన వైనం
ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనాల్లో ఐదోదైన సియోల్‌లోని 123 అంతస్తుల లొట్టో వరల్డ్ టవర్‌ను తాళ్ల సాయం లేకుండా ఎక్కేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ వ్యక్తిని దక్షిణ కొరియా పోలీసులు నిర్బంధించారు. దాదాపు సగం వరకు ఎక్కేసిన తర్వాత అధికారులు అతడిని కిందికి దించారు. షార్ట్స్ ధరించిన 24 ఏళ్ల యువకుడు ఈ ఆకాశహర్మ్యాన్ని సోమవారం గంటపాటు ఎక్కి 73వ అంతస్తుకు చేరుకున్నాడు.
అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మెయింటెనెన్స్ కార్డెల్‌ను పంపి భవనంలోకి వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని జార్జ్ కింగ్ థాంప్సన్‌గా గుర్తించారు.
2019లో అతడు లండన్‌లోని షర్డ్ భవనాన్ని ఎక్కి జైలుపాలైనట్టు బ్రిటిష్ మీడియా తెలిపింది. కాగా, 2018లో లొట్టో వరల్డ్ టవర్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన ‘ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్’ అలైన్ రోబెర్డ్‌ను కూడా అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు.