శరద్‌పవార్‌ను చంపేస్తానన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్
- నిందితుడిని పూణెకు చెందిన సాగర్ బార్వేగా గుర్తించిన పోలీసులు
- నరేంద్ర దభోల్కర్‌కు పట్టిన గతే పడుతుందని ఫేస్‌బుక్ ద్వారా హెచ్చరిక
- ఐపీ అడ్రస్ ద్వారా పట్టుకున్న పోలీసులు
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను చంపేస్తానని బెదిరించిన పూణెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని 32 ఏళ్ల సాగర్ బార్వేగా గుర్తించారు. ఈ నెల 14 వరకు కోర్టు అతడిని రిమాండ్‌కు పంపింది. బార్వే ఫేస్‌బుక్ ద్వారా శరద్ పవార్‌కు హెచ్చరికలు పంపాడు. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా వస్తున్న బెదిరింపులపై పవార్ కుమార్తె సుప్రియా సూలె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బార్వే ఫేస్‌బుక్‌లో శరద్ పవార్‌ను హెచ్చరిస్తూ చేసిన పోస్టులో.. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్‌కు పట్టిన గతే శరద్ పవార్‌కూ పడుతుందని హెచ్చరించాడు. నరేంద్ర దభోల్కర్‌ను 2013లో బైక్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. ఈ బెదిరింపుపై ఎన్సీపీ కార్యకర్త ప్రత్యేకంగా లోక్‌మాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు బార్వేను అరెస్ట్ చేశారు. ట్విట్టర్ ద్వారా బెదిరించిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.