హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లిన నవదంపతుల దుర్మరణం
- హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లిన తమిళనాడు నవదంపతులు
- ఈ నెల 9న బాలీ సముద్ర తీరంలో బోటులో షికారు
- అకస్మాత్తుగా బోటు బోల్తా పడటంతో నవదంపతుల దుర్మరణం
- మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు
హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లిన నవదంపతులు బోటు బోల్తా పడటంతో సముద్రంలో పడి దుర్మరణం చెందారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన వైద్యురాలు విభూషిణియాకు చెన్నైకి చెందిన డాక్టర్ లోకేశ్వరన్‌తో ఇటీవలే వివాహం జరిగింది. నూతన దంపతులు హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి వెళ్లారు.
ఈ క్రమంలో ఈ నెల 9న వారు బోటులో షికారుకు వెళ్లారు. అయితే, అకస్మాత్తుగా పడవ బోల్తా పడటంతో దంపతులు నీట మునిగి మృతి చెందారు. లోకేశ్వరన్ మృతదేహాన్ని వెంటనే వెలికితీయగా, విభూషిణియా మృతదేహం మాత్రం శనివారం లభ్యమైంది. మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.