గడ్డి తింటున్న పులులు.. ఎందుకంటే..!
- మహారాష్ట్ర యావత్వాల్ అడవుల్లో గడ్డి తిన్న రెండు పులులు
- అదురైన దృశ్యాన్ని ఫొటో తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్
- ఆహారం అరగకపోతే పులులు గడ్డి తింటాయంటున్న నిపుణులు
- లేత గడ్డితో ఆహారం జీర్ణమై పులికి కడుపు నొప్పి నుంచి ఉపశమనం
పులి క్రూర జంతువు, మాంసాహారి! అలాంటి పులి గడ్డి తింటోందంటే ఆశ్చర్యం కలగకమానదు. అయితే, ఇది సహజమేనని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా మతాని గ్రామ అడవుల్లో రెండు పులులు గడ్డి తింటూ కెమెరాకు చిక్కాయి. ఈ దృశ్యాల్ని ఓ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు.
ఇంతకీ, విషయం ఏమిటంటే.. మాంసాహారం జీర్ణం కాక కడుపు నొప్పి వచ్చినప్పుడు పులి గడ్డి తింటుందట. లేత గడ్డి తింటే ఆహారం త్వరగా జీర్ణమై నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. అందుకే, పులులు అప్పుడప్పుడూ ఇలా చేస్తాయని, అయితే ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.